దిమాక్ ఖరాబ్ చేస్తది!


Tue,June 11, 2019 11:42 PM

Nabha Natesh stuns everyone with her glamour in iSmart Shankar

నన్ను దోచుకుందువటే చిత్రంతో తెలుగు చిత్రసీమలో అరంగ్రేటం చేసింది కన్నడ కస్తూరి నభానటేష్. చారడేసి కళ్లలో కావాల్సినంత చిలిపిదనాన్ని ఒలికిస్తూ యువ హృదయాల్ని దోచుకుంది. అందం, అభినయం కలబోతగా ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం ఈ సొగసరికి తెలుగులో వరుస అవకాశాలు లభిస్తున్నాయి. రామ్ సరసన ఇస్మార్ట్‌శంకర్, రవితేజ జోడీగా డిస్కో రాజా చిత్రాల్లో నటిస్తుందీ సుందరి. నభా హాస్యాన్ని పండించే విధానం బాగా నచ్చింది. నన్ను దోచుకుందువటే ట్రైలర్‌లో ఆమె నటనను చూసి డిస్కోరాజా కోసం ఎంపిక చేసుకున్నాం అని ఆ చిత్రబృందం తెలిపింది. నభానటేష్ హుషారైన అమ్మాయి. ఎలాంటి పాత్రలోనైనా మెప్పిస్తుంది. ఇస్మార్ట్‌శంకర్‌లో ఆమె పాత్ర కీలకంగా ఉంటుంది అని చిత్ర ప్రతినిధి పేర్కొన్నారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో దిమాక్ ఖరాబ్ అనే లిరికల్ వీడియోలో అందాల ప్రదర్శనతో కుర్రకారుని ఉర్రూతలూగించింది ఈ కన్నడ సోయగం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

2033

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles