సంగీతభరిత ప్రణయగాథ


Mon,September 9, 2019 10:56 PM

Naga Chaitanya Sai Pallavi team up for Sekhar Kammulas next

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఏమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ పతాకంపై నారాయణ్‌దాస్ కె నారంగ్, పి.రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి శేఖర్ కమ్ముల తండ్రి శేషయ్య క్లాప్‌నివ్వగా, డిస్ట్రిబ్యూటర్ సదానందం కెమెరా స్విఛాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ గ్రామం నుంచి వచ్చి జీవితంలో ఏదో సాధించాలి అనుకునే ఓ జంట ప్రేమకథ ఇది. సంగీతభరిత ప్రణయగాథగా అలరిస్తుంది. ఈ సినిమా కోసం నాగచైతన్య తెలంగాణ యాసని ఎంతో ఇష్టపడి నేర్చుకున్నాడు. నా సినిమాల్లో సంగీతం ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో మరింత ప్రభావవంతంగా అనిపిస్తుంది. నాగచైతన్య, సాయిపల్లవి పాత్ర చిత్రణ ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ఏ.ఆర్.రెహమాన్ స్కూల్ నుంచి వచ్చిన పవన్ ఈ సినిమాకు సంగీతాన్నందిస్తున్నాడు అని చెప్పారు. ప్రస్తుతం మొదలైన షెడ్యూల్ పదిరోజుల పాటు జరుగుతుంది. మూడు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తిచేస్తాం అని నిర్మాత పి.రామ్మోహన్‌రావు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటుల వివరాల్ని త్వరలో తెలియజేయబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ సి కుమార్, సంగీతం: పవన్, ఆర్ట్: రాజీవ్ నాయర్, సహనిర్మాత: విజయ్‌భాస్కర్, రచన-దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

185

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles