వైజాగ్‌లో యాక్షన్‌

Sat,September 28, 2019 12:03 AM

నాగశౌర్య, మెహరీన్‌ జంటగా ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతున్నది. ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమణతేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవలే వైజాగ్‌లో నాగశౌర్యపై యాక్షన్‌ సన్నివేశాల్ని చిత్రీకరించారు. “కేజీఎఫ్‌' ఫేమ్‌ అన్బు అరివు తెలుగులో తొలిసారి యాక్షన్‌ కొరియోగ్రఫీని అందిస్తున్న చిత్రమిది. ైస్టెలిష్‌గా సాగే ఈ పోరాట ఘట్టాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ పోరాట ఘట్టాలతో వైజాగ్‌ షెడ్యూల్‌ పూర్తయింది. మాస్‌, క్లాస్‌ను మెప్పించే కథ, కథనాలతో వినూత్నంగా సినిమా ఉంటుంది. తదుపరి షెడ్యూల్‌ను అక్టోబర్‌లో హైదరాబాద్‌లో ప్రారంభిస్తాం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి ‘అశ్వత్థామ’ అనే పేరును పరిశీలిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, సత్య, జయప్రకాష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌, కెమెరా: మనోజ్‌రెడ్డి, కథ: నాగశౌర్య.

388

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles