మున్నార్‌లో మంచివాడు

Sat,November 9, 2019 12:02 AM

కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఎంత మంచివాడవురా. సతీష్ వేగేశ్న దర్శకుడు. మెహరీన్ కథానాయిక. ఉమేష్‌గుప్తా, సుభాష్‌గుప్తా నిర్మాతలు. ప్రస్తుతం చిత్రీకరణ కేరళలోని మున్నార్‌లో జరుగుతున్నది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకులముందుకురానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ కల్యాణ్‌రామ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిది. ప్రస్తుతం కేరళలోని మున్నార్‌లో చిత్రీకరణ జరుపుతున్నాం. కుటుంబ అనుబంధాలు కలబోసిన కథాంశమిది అన్నారు. మున్నార్‌లో నాయకానాయికల మీద ఓ పాటను చిత్రీకరిస్తున్నాం. సుందరమైన మున్నార్ అందాల నడుమ తెరకెక్కిస్తున్న ఈ పాట కన్నులపండువగా ఉంటుంది. ఇప్పటికే ఎనభైశాతం చిత్రీకరణ పూర్తయింది అని నిర్మాతలు తెలిపారు. వి.కె.నరేశ్, సుహాసిని, శరత్‌బాబు, తనికెళ్ల భరణి, పవిత్రాలోకేష్, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, సంగీతం: గోపీసుందర్, ఆర్ట్: రామాంజనేయులు, సమర్పణ: శివలెంక కృష్ణప్రసాద్, రచన-దర్శకత్వం: సతీష్ వేగేశ్న.

312

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles