వ్యవస్థను చక్కదిద్దే అక్షర


Thu,September 5, 2019 11:05 PM

Nanditha Shweta s Akshara to release in October

నందితాశ్వేత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం అక్షర. బి.చిన్నికృష్ణ దర్శకుడు. సురేష్‌వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. అక్టోబర్ ద్వితీయార్థంలో సినిమా విడుదలకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ వాటికి చక్కటి పరిష్కార మార్గాల్ని సూచించే చిత్రమిది. వాణిజ్య హంగులకు చక్కటి సందేశాన్ని జోడించి రూపొందిస్తున్నాం. నందితాశ్వేత పాత్ర నవ్యరీతిలో ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన లభిస్తున్నది అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఇలాంటి కథాంశాలతో అరుదుగా సినిమాలు రూపొందుతాయి. దర్శకుడిగా మంచిసినిమా చేస్తున్నాననే సంతృప్తినిమిగిల్చింది అని అన్నారు. సత్య, మధునందన్, షకలకశంకర్, శ్రీతేజ, అజయ్‌ఘోష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్: నగేష్ బన్నెల్, సంగీతం:సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్: జి.సత్య.

243

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles