ఆ టెన్షన్‌ను ఎంజాయ్‌చేస్తాను


Wed,September 11, 2019 11:40 PM

Nanis Gang Leader Movie Press Meet

‘ఎగ్జామ్స్‌ ముందు టెన్షన్‌ ఎలా ఉంటుందో సినిమా విడుదల ముందు నేను అలాగే ఒత్తిడికి లోనవుతాను. ఈ టెన్షన్‌లో గమ్మత్తైన కిక్‌ ఉంటుంది. ఆ అనుభూతిని నేను ఎంజాయ్‌చేస్తాను’ అని అన్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నానీస్‌ గ్యాంగ్‌లీడర్‌. విక్రమ్‌.కె.కుమార్‌ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సీవీఎమ్‌) నిర్మించారు. ప్రియాంక కథానాయిక. ఈ నెల 13న విడుదలకానుంది. బుధవారం చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్ది ఉత్సుకతతో పాటు భయం కలుగుతున్నాయి. థియేటర్లలో ప్రేక్షకుల నవ్వుల్ని చూడటం కోసం మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. దర్శకుడు విక్రమ్‌ కెరీర్‌లో వేగంగా పూర్తయిన సినిమా ఇది. షూటింగ్‌ సరదాగా సాగడంతో బ్రేక్‌ తీసుకోవాలనే ఆలోచన మాలో ఎవరికి రాలేదు. రెండు రోజులు షూటింగ్‌ లేకపోతే చాలా విరామం వచ్చిన ఫీలింగ్‌ కలిగేది. కథతో పాటు నేను, లక్ష్మి, శరణ్య, ప్రియాంక..మా కాంబినేషన్‌ చాలా ఫన్‌గా ఉండేది. పెయిడ్‌హాలీడేలా సినిమాను ఎంజాయ్‌చేశాం.

అదే ఫీలింగ్‌ ప్రేక్షకులకు కలుగుతుంది. ఈ సినిమాలో నటుడిగా కొత్త కార్తికేయను చూస్తారు. ప్రియాంకకు మంచి పేరుతెచ్చిపెడుతుంది. నవ్వులను పంచుతూనే హృదయాల్ని స్పృశించే చిత్రమిది’ అని అన్నారు. కార్తికేయ మాట్లాడుతూ ‘కథ, నా పాత్ర నచ్చడంతో ఈసినిమాలో భాగమయ్యాను. ఒకవేళ ఈ సినిమా చేయకపోయుంటే నటుడిగా చాలా మిస్సయ్యేవాణ్ణి. పది, పదిహేనేళ్ల వరకు నిలిచిపోయే సరికొత్త జోనర్‌ చిత్రమిది. చాలా సినిమాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. ‘సినిమా విజయంపై చాలా విశ్వాసంతో ఉన్నాం. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. మూడేళ్లుగా నానితో సినిమా చేయాలని అనుకుంటున్నాం. ఈ చిత్రంతో కుదిరింది. పక్కా ప్లానింగ్‌తో కేవలం ఆరు నెలల్లోనే సినిమాను పూర్తిచేశాం’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విక్రమ్‌.కె.కుమార్‌, చెర్రీ పాల్గొన్నారు.

438

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles