నన్ను ఇన్‌వాల్వ్ చేయకండి!

Sun,November 3, 2019 12:14 AM

నిత్యం వివాదాలతో సహజీవనం చేయడం దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ నైజం. ముఖ్యంగా సోషల్‌మీడియాలో సంచలన పోస్ట్‌లతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. తాజాగా ఆయన ట్విట్టర్‌లో చేసిన ఓ పోస్ట్‌పై అగ్ర దర్శకుడు రాజమౌళి సరదాగా స్పందించారు. వివరాల్లోకి వెళితే.. రామ్‌గోపాల్‌వర్మ రూపొందిస్తున్న కమ్మరాజ్యంలో కడపరెడ్లు చిత్రం నుంచి కేఏపాల్ గురించి ఓ పాటను విడుదల చేశారు. దీనిపై వర్మ ఓ ట్వీట్ చేశారు. ఇండియాలో జోకర్ సినిమా పెద్ద విజయం సాధించినప్పుడు, కేఏపాల్ బయోపిక్ తీస్తే బాహుబలి-3 కంటే పెద్ద హిట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి రాజమౌళి వాషింగ్టన్‌లో కేఏపాల్‌తో చర్చించారట. పాల్ ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి చెప్పారు అని ట్వీట్ చేశారు దీనిని రాజమౌళికి ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్‌పై రాజమౌళి స్పందిస్తూ నన్ను ఇన్‌వాల్వ్ చేయకండి రాజుగారు అంటూ సరదాగా స్పందించారు. రెండు సామాజిక వర్గాల పేర్లను ప్రస్తావిస్తూ రూపొందిస్తున్న వివాదాస్పద చిత్రంలో తనను లాగొద్దనే భావనతో రాజమౌళి ఈ ట్వీట్ చేశారని నెటిజన్లు అంటున్నారు.

496

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles