ప్రేమతో ‘నీ కోసం’


Sun,August 25, 2019 11:34 PM

nee kosam movie release on sep 6th

అరవింద్‌రెడ్డి, శుభాంగిపంత్, అజిత్‌రాధారం, దీక్షితా పార్వతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం నీకోసం. అవినాష్ కోకటి దర్శకుడు. అల్లూరమ్మ (భారతి) నిర్మాత. సెప్టెంబర్ 6న ప్రేక్షకులముందుకురానుంది. ఇటీవలే విడుదలైన చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ చిత్ర యూనిట్‌ను అభినందించారు. కొత్తదనంతో కూడిన ట్రైలర్‌ను చూసి పవన్‌కల్యాణ్ ఇంప్రెస్ అయ్యారు. కథ గురించి తెలుసుకొని బాగుందని మెచ్చుకున్నారు. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తెలుగు పరిశ్రమకు అవసరమని చెప్పారు. ముక్కోణపు ప్రేమకథ ఇది. ప్రేమపయనంలోని అనుభూతులకు అద్దం పడుతుంది. ప్రేమను కొత్తకోణంలో ఆవిష్కరిస్తుంది అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: శివక్రిష్ణ, రచన-దర్శకత్వం: అనినాష్ కోకటి.

290

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles