డిఫరెంట్ ఎంటర్‌టైనర్

Fri,November 8, 2019 11:57 PM

ఇస్మార్ట్‌శంకర్ సినిమాతో తెలుగులో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నది నిధి అగర్వాల్. ఈ సినిమాలో గ్లామర్, అభినయం కలబోసిన పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించిందీ సొగసరి. తాజాగా తెలుగులో మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది నిధి అగర్వాల్. మహేష్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లాను కథానాయకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కనున్నది. వైవిధ్యమైన కథ, కథనాలతో రూపొందనున్న ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా నిధి అగర్వాల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

259

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles