రాణి పార్వతీబాయి

Tue,November 5, 2019 12:04 AM

బాలీవుడ్‌లో ఈ ఏడాది కృతిసనన్ హవా కొనసాగుతున్నది. ఇప్పటికే నాలుగు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె తాజా చిత్రం పానిపట్‌తో మరోమారు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. 18వ శతాబ్దంలో అఫ్ఘాన్, మరాఠాలకు మధ్య జరిగిన మూడో పానిపట్ యుద్ధం ఆధారంగా చారిత్రక కథాంశంతో పానిపట్ చిత్రం తెరకెక్కుతున్నది. అశుతోష్‌గోవారికర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అర్జున్‌కపూర్, సంజయ్‌దత్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ సినిమాలో మరాఠా రాణి పార్వతిబాయిగా కృతిసనన్ కనిపించనున్నది. ఆమె ఫస్ట్‌లుక్‌ను హీరో అర్జున్‌కపూర్ ట్విట్టర్ ద్వారా సోమవారం విడుదలచేశారు. ఇందులో ముక్కుపుడక, బంగారు ఆభరణాలు ధరించి రాచరికపు వస్త్రధారణలో వినూత్నమైన లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నది కృతిసనన్. నిజమైన రాణికి కిరీటం అవసరం లేదు అనే వ్యాఖ్యను జోడించారు. కృతిసనన్‌తో పాటు అర్జున్‌కపూర్, సంజయదత్ ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌ను చిత్రబృందం విడుదలచేసింది. డిసెంబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది.

393

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles