నిర్మాత గిరిని నా కుటుంబ సభ్యుడిగా భావిస్తాను. తనయుడు యోగీశ్వర్‌ను హీరోగా పరిచయం చేస్తూ అతడు నిర్మిస్తున్న ఈ సినిమా యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని అలరిస్తుందనే నమ్మకముందిఅని అన్నారు సీనియర్ నటుడు సుమన్. యోగీశ్వర్, అతిథి జంటగా నటిస్తున్న చిత్రం పరారి. రన్ ఫర్ ఫన్ ఉపశీర్షిక. శివాజీ దర్శకుడు. జీవీవీ గిరి నిర్మిస్తున్నారు. మహిత్ నారాయణ్ స్వరాలను సమకూర్చిన ఈ చిత్ర గీతాలు శనివారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. సుమన్ ఆడియో సీడీలను విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుటుంబమంతా కలిసి చూసే ఆహ్లాదభరితమైన చిత్రమిది. మహిత్ చక్కటి బాణీలతో సినిమాకు సగం విజయాన్ని అందించాడు అని తెలిపారు.
వినోదమే పరమావధిగా రూపొందిన చిత్రమిది. అంజి ఛాయాగ్రహణం, నందు పోరాటాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. హీరోగా యోగేశ్వర్‌కు శుభారంభాన్ని అందిస్తుంది అని నిర్మాత చెప్పారు. మూడేళ్ల కష్టానికి ప్రతిఫలమిదని దర్శకుడు పేర్కొన్నారు. చిన్న సినిమా అయినా చక్కటి వాణిజ్య విలువలతో తెరకెక్కించారని దర్శకుడు రేలంగి నరసింహారావు అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ కందుకూరి, దామోదర్‌ప్రసాద్, శ్రవణ్, మహిత్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.