పింక్ రీమేక్‌లో పవన్?

Sun,November 3, 2019 12:10 AM

అజ్ఞాతవాసి సినిమా తర్వాత రాజకీయాల్లో బిజీగా మారారు పవన్‌కల్యాణ్. ఆయన తదుపరి చిత్రం ఏమిటనే విషయంలో సందిగ్ధత నెలకొంది. తాజాగా పవన్‌కల్యాణ్ కొత్త చిత్రం ఖరారైంది. హిందీలో విజయవంతమైన పింక్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఇందులో పవన్‌కల్యాణ్ నటించబోతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజుతో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తారు. బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్‌ఆదర్శ్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు. పింక్ చిత్రంలో అమితాబ్‌బచ్చన్ నటించారు. కోర్టురూమ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తమిళంలో అజిత్‌తో రీమేక్ చేశారు. అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు పవన్‌కల్యాణ్‌తో తెలుగులో రీమేక్ చేయబోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

348

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles