బాహుబలి-3రాబోతున్నదా?


Sun,August 25, 2019 12:45 AM

Prabhas Saaho release date postponed to August 30

సాహో సినిమా ప్రచార కార్యక్రమాల్లో తీరికలేకుండా గడుపుతున్నారు ప్రభాస్. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో ప్రేక్షకులముందుకురానుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బెంగళూరులో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ బాహుబలి-3 తెరకెక్కే అవకాశం లేకపోలేదన్నారు. రాజమౌళి ఆసక్తి చూపిస్తే బాహుబలి-3 కార్యరూపం దాల్చే ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాహుబలి సినిమా రెండుభాగాల్లో 60శాతం కథను మాత్రమే చూపించాం. రాజమౌళి తన మదిలో బాహుబలి సీక్వెల్-3 ఆలోచన ఉందన్నారు. అయితే అది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో నాకు తెలియదు. బాహుబలి కోసం నాలుగు సంవత్సరాలు కేటాయించడం ఏమాత్రం బాధగా లేదు. ఆ సినిమాలో పోషించిన అమరేంద్రబాహుబలి, మహేంద్రబాహుబలి పాత్రలు నా కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోతాయి అన్నారు. ప్రభాస్ వ్యాఖ్యలు బాహుబలి-3 పై ఒక్కసారిగా అభిమానుల్లో ఆశల్ని పెంచాయి.

984

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles