ప్రతీకార నేపథ్యంలో..

Tue,October 1, 2019 12:03 AM

పరిచయం ఫేమ్ విరాట్ కథానాయకుడిగా ది మాంక్, ఆర్చి ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతున్నది. నితిన్.జి దర్శకత్వం వహిస్తున్నారు. వై.సంతోష్, నిమేశ్ దేశాయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. సోమవారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేసింది. దర్శకుడు మాట్లాడుతూ ప్రతీకార నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా చిత్రమిది. ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రల్ని పోషించనున్నారు అని తెలిపారు. హీరో విరాట్ మాట్లాడుతూ పరిచయం తర్వాత నేను హీరోగా నటిస్తున్న చిత్రమిది. నన్ను నమ్మి దర్శకనిర్మాతలు అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెడతాను అని చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ మా సంస్థ నిర్మిస్తున్న రెండో చిత్రమిది. దర్శకుడు నితిన్ విభిన్నమైన పాయింట్‌తో కథను సిద్ధంచేశారు. త్వరలో చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాల్ని వెల్లడిస్తాం అని పేర్కొన్నారు.

184

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles