తెలంగాణ ప్రేమకథ


Tue,June 11, 2019 11:41 PM

prema janta movie release on 28 june 2019

రామ్ ప్రణీత్, సుమయ జంటగా నటిస్తున్న చిత్రం ప్రేమ జంట. మహేష్ మొగుళ్లూరి నిర్మాత. దగ్గుబాటి వరుణ్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నిఖిలేష్ తొగరి దర్శకుడు. సెన్సార్ పూర్తయింది. యు.ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 28న ఈ చిత్రం విడుదలకానుంది. నిర్మాత మాట్లాడుతూ తెలంగాణ నేపథ్యంలో సాగే పల్లెటూరి ప్రేమకథ ఇది. దర్శకుడు నిఖిలేష్ వినూత్నమైన ఇతివృత్తంతో సినిమాను తెరకెక్కించారు. ప్రేమను కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తున్నది అని తెలిపారు. ఓ జంట ప్రేమప్రయాణానికి దృశ్యరూపమిదని.. అదిలాబాద్, ప్రకాశం జిల్లాలోని అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరిపామని, రామ్ ప్రణీత్, సుమయ జోడీ ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు.

2118

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles