గంగుబాయిగా ప్రియాంక


Fri,March 22, 2019 11:28 PM

priyanka chopra in sanjay leela bhansalis gangubai heres what we know

బాలీవుడ్‌లో ప్రియాంకచోప్రా సినిమా చేసి మూడేళ్లు దాటిపోయింది. 2016లో వచ్చిన జై గంగాజల్ తర్వాత హిందీ చిత్రసీమకు దూరమైన ఆమె హాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సుదీర్ఘ విరామం తర్వాత ప్రియాంకచోప్రా హిందీలో పునరాగమనం చేస్తూ సంజయ్‌లీలాభన్సాలీ దర్శకత్వంలో నటించబోతున్నది. మహిళా ప్రధాన ఇతివృత్తంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి గంగుబాయి అనే పేరును ఖరారు చేసినట్లు భన్సాలీ పేర్కొన్నారు. ముంబయిలోని కామటిపుర అనే రెడ్‌లైట్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో ప్రియాంకచోప్రా గంగుబాయి అనే వేశ్యా గృహ నిర్వాహకురాలిగా కనిపించబోతున్నట్లు సమాచారం.

డీ గ్లామర్ లుక్‌తో ప్రియాంక పాత్ర ఛాలెంజింగ్‌గా ఉంటుందని తెలిసింది. నన్ను అమితంగా ఆకట్టుకున్న కథ ఇది. ఈ కథను తెరపై ఆవిష్కరించేందుకు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చబోతున్నది అని భన్సాలీ తెలిపారు. ఈ ఏడాది చివరలో ఈ చిత్రం సెట్స్‌పైకిరానుంది. గతంలో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చినా రామ్‌లీలాలో ప్రత్యేకగీతం, బాజీరావ్ మస్తానీ చిత్రంలో కీలక పాత్రలో నటించింది ప్రియాంకచోప్రా. గత ఏడాది పాప్‌గాయకుడు, నటుడు నిక్ జోనస్‌ను పెళ్లాడిన ప్రియాంకచోప్రా ప్రస్తుతం వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నది.

1115

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles