‘వైట్‌ టైగర్‌' నవలా కథాంశంతో..


Fri,September 6, 2019 11:21 PM

Priyanka Chopra is all excited to star in The White Tiger adaptation with Rajkummar Rao

భారతీయ రచయిత అరవింద్‌ అడిగా సృజించిన ‘ది వైట్‌ టైగర్‌' నవల 2008 సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన బుకర్‌ప్రైజ్‌ను సొంతం చేసుకుంది. ఈ నవల ఆధారంగా బాలీవుడ్‌లో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఇందులో రాజ్‌కుమార్‌ రావు, ప్రియాంకచోప్రా జంటగా నటించనున్నారు. ప్రపంచీకరణ తరుణంలో ఓ గ్రామీణ వ్యక్తి జీవన ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ హాస్యప్రధానంగా ఈ నవలను రచించారు. కుల వివక్ష, అవినీతి, విధేయత, పేదరికం..అంశాల చుట్టూ నవలా ఇతివృత్తం నడుస్తుంది. ‘నాకు ఎంతగానో ఇష్టమైన నవల ఇది. భారతీయ సమాజపు మరో పార్శాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ నవలా చిత్రంలో నటించడం సవాలుగా స్వీకరిస్తున్నాను’ అని ప్రియాంకచోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాఖ్యానించింది. ఈ చిత్రానికి రామిన్‌బహ్రాని దర్శకత్వం వహించబోబోతున్నాడు. ఈ ఏడాది చివరలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఇదిలావుండగా ప్రియాంకచోప్రా నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘ది స్కై ఈజ్‌ పింక్‌' అక్టోబర్‌ 11న ప్రేక్షకులముందుకురానుంది.

453

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles