హీరోగా అరంగేట్రం


Tue,May 14, 2019 11:26 PM

Producer Dil Raju Announced Director VV Vinayak As An Actor In His Next Movie

వాణిజ్య చిత్రాల రూపకల్పనలో అగ్రశ్రేణి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు వి.వి.వినాయక్. మాస్ నాడీ తెలిసిన దర్శకుడని ఆయన్ని అభివర్ణిస్తారు. తెర వెనక నిర్ధేశకుడిగా ఎన్నో భారీ విజయాల్ని తన ఖాతాలో వేసుకున్న వినాయక్ తాజాగా వెండితెరపై కథానాయకుడిగా అరంగేట్రం చేయబోతుండటం విశేషం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెరకెక్కించబోతున్నారు. ఎన్.నరసింహారావు దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభంకానుంది. మహర్షి చిత్ర విజయాన్ని పురస్కరించుకొని మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్‌రాజు అక్కడ మీడియా వారితో ముచ్చటిస్తూ ఈ సినిమా విశేషాల్ని వెల్లడించారు. దిల్ సినిమాతో మా సంస్థ ప్రయాణం ఆరంభమైంది. నా పేరు కూడా దిల్‌రాజుగా మారింది. ఈ మధ్యే స్క్రిప్ట్ విన్నాను. బాగా నచ్చింది. ఇందులో వినాయక్ నటిస్తే బాగుంటుందనిపించింది. కథ విని ఆయన కూడా ఓకే చెప్పారు. దిల్‌తో మా సంస్థ ప్రారంభానికి కారణమైన వినాయక్‌ను నటుడిగా పరిచయం చేయబోతుండటం ఆనందంగా ఉంది అని అన్నారు దిల్‌రాజు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలో వెల్లడించబోతున్నారు.

2858

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles