నేను నేర్చుకున్న విలువైన పాఠం!


Thu,September 5, 2019 11:12 PM

Producer Vishnu Vardhan Induri Press Meet

ఎన్టీఆర్ బయోపిక్‌ను రెండు భాగాలుగా కాకుండా ఒకే పార్ట్‌గా తెరకెక్కిస్తే ఫలితం మరోలా ఉండేది. ఆ విషయంలో ఎవరినీ తప్పుపట్టడం లేదు. కెరీర్‌లో నేను నేర్చుకున్న అత్యంత విలువైన పాఠమిది అని అన్నారు నిర్మాత విష్ణు ఇందూరి. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం 83తో పాటు జయలలిత బయోపిక్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారాయన. గురువారం విష్ణు ఇందూరి జన్మదినం. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో ముచ్చటిస్తూ సీసీఎల్ కోసం చాలా సంవత్సరాలు పనిచేశాను. ఆ సమయంలో క్రికెట్ నేపథ్యంలో మంచి కథ చెప్పాలనిపించింది.ఆ ఆలోచనల నుంచి 83 సినిమా పుట్టింది. క్రికెట్‌ను ప్రేమించే ప్రతి అభిమానిని ఆకట్టుకుంటుంది. 1983లో క్రికెటర్లకు రోజుకు 200 రూపాయల పారితోషికం ఉండేది. అలాంటి క్రీడాకారులు దేశానికి ఏ విధంగా గర్వకారణంగా నిలిచారు? ఈ గమ్యంలో వారికి ఎదురైన అవరోధాలతో స్ఫూర్తిప్రధానంగా ఉంటుంది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాం. క్రికెట్ పట్ల కబీర్‌ఖాన్‌కు ఉన్న పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని అతడిని దర్శకుడిగా ఎంచుకున్నాం. 100 రోజులు యూకేలో ప్రధాన సన్నివేశాల్ని చిత్రీకరించాం. ఇంకో 20 శాతం షూటింగ్ మిగిలివుంది. ఇండియాలో ఈ సన్నివేశాల్ని పూర్తిచేస్తాం. హిందీలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో అనువదించనున్నాం. ఏప్రిల్ 2020లో విడుదలచేస్తాం.

314

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles