మిలటరీ కమాండో యాక్షన్

Sun,November 3, 2019 12:06 AM

విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం యాక్షన్ అదే పేరుతో తెలుగులో విడుదలకానుంది. సుందర్ సి దర్శకుడు. శ్రీకార్తికేయ సినిమాస్ పతాకంపై నిర్మాత శ్రీనివాస్ ఆదెపు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఇటీవల దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ఇస్మార్ట్‌శంకర్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ ఆదెపు ఈ సినిమా ద్వారా నిర్మాతగా మారుతున్నాడు. యాక్షన్ ట్రైలర్ చాలా బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. నిర్మాత మాట్లాడుతూ రొమాంచితమైన యాక్షన్ అంశాలతో సాగే చిత్రమిది. ఇందులో విశాల్ మిలటరీ కమాండోగా కనిపిస్తారు. నవంబర్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకొస్తాం అని చెప్పారు

267

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles