జంధ్యాల శైలి వినోదం..


Mon,August 12, 2019 12:13 AM

Puri jagannath Speech At Pandugadi Photo Studio Movie Audio Launch

ఆలీ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పండుగాడి ఫొటో స్టూడియో. వీడు ఫొటో తీస్తే పెళ్ళి అయిపోద్ది ఉపశీర్షిక. దిలీప్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. గుదిబండి వెంకటసాంబిరెడ్డి నిర్మిస్తున్నారు. యాజమాన్య స్వరాలను సమకూర్చిన ఈ చిత్ర గీతాలను శనివారం హైదరాబాద్‌లో దర్శకులు పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను విడుదలచేశారు. ట్రైలర్‌ను ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి ఆవిష్కరించారు. కథ, కథనం, పాటలు నచ్చడంతో ఈ సినిమాను అంగీకరించానని ఆలీ చెప్పారు. నిర్మాతగా నా తొలి చిత్రమిది. కుటుంబ సమేతంగా చూడదగిన వినోదభరిత కథాంశంతో రూపొందించాం. ఇదే బ్యానర్ ద్వారా మమ్ముట్టి నటించిన ఓ సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నాం అని నిర్మాత పేర్కొన్నారు. దర్శకుడు దిలీప్‌రాజా మాట్లాడుతూ జంధ్యాల శైలి హాస్యభరిత చిత్రమిది. దర్శకుడు సుకుమార్ ఈ కథ విని బాగుందని చెప్పిన తర్వాతే షూటింగ్ మొదలుపెట్టాం. పండు అనే ఫొటోగ్రాఫర్ కథతో ఆద్యంతం నవ్విస్తుంది. అతడి పెళ్లి కహానీ ఏమిటన్నది ఆసక్తిని పంచుతుంది. తెనాలిలో సినిమాను, అరకులో పాటల్ని చిత్రీకరించాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, అల్లరి నరేష్, ఛార్మి, ప్రవీణ, అనిల్ కడియాల తదితరులు పాల్గొన్నారు.

394

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles