రాహు రహస్యం


Fri,August 9, 2019 11:44 PM

Raahu First look poster of Kriti Garg Kalakeya Prabhakar starrer is out

కృతిగార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం రాహు. సుబ్బు వేదుల దర్శకత్వం వహిస్తూ ఏ.వి.ఆర్ స్వామి, శ్రీశక్తి బాబ్జీ, రాజు దేవరకొండలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్ర ఫస్ట్‌లుక్ విడుదలైంది. దర్శకుడు సుబ్బు వేదుల మాట్లాడుతూ వినూత్న కథాంశాలతో కొత్త దర్శకులు సినిమాలు చేస్తూ తెలుగు చిత్రసీమలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇది అలాంటి నవీన ప్రయత్నమే అవుతుంది. థ్రిల్లర్ కథాంశంతో ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. రాహు ఎవరు? ఆ పేరు వెనుక ఉన్న రహస్యమేమిటన్నది ఆకట్టుకుంటుంది. ఫస్ట్‌లుక్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సరికొత్త అనుభూతిని పంచే చిత్రమిది అని తెలిపారు. చలాకీ చంటి, సత్యం రాజేష్, గిరిధర్, స్వప్నిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు.

356

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles