ఉండిపోరాదే ఇలలో..


Wed,August 7, 2019 12:04 AM

raj kandukuri released vundi porade

కథను నమ్మి నిజాయితీగా తెరకెక్కించిన సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వినూత్నమైన కథాంశాలతో రూపొందిన చిన్న సినిమాలు మంచి విజయాల్ని సాధిస్తున్నాయి. ఆ కోవలో ఈ సినిమా నిలవాలి అని అన్నారు నిర్మాత రాజ్ కందుకూరి. తరుణ్‌తేజ్, లావణ్య జంటగా నటిస్తున్న చిత్రం ఉండిపోరాదే. నవీన్ నాయని దర్శకుడు. డాక్టర్ లింగేశ్వర్ నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లో నిర్మాత రాజ్ కందుకూరి విడుదలచేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై ఎంతవరకు ఉంటుందనే కథాంశంతో రూపొందిస్తున్న చిత్రమిది. కుటుంబ బంధాలు, ప్రేమ, వినోదం, భావోద్వేగాల సమాహారంగా సాగుతుంది.

పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నది. నాయకానాయికలు కొత్తవారైనా చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. పతాకఘట్టాలు మనసుల్ని కదిలిస్తాయి. కథాగనుణంగా మంచి టైటిల్ కుదిరింది. వందశాతం సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది అని తెలిపారు. హృదయాల్ని స్పృశించే అందమైన ప్రేమకథ ఇదని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేస్తామని దర్శకుడు పేర్కొన్నారు. హీరో మాట్లాడుతూ టీనేజ్ ప్రేమకథ ఇది. అంతర్లీనంగా మంచి సందేశం మిళితమై ఉంటుంది. యువతతో పాటు కుటుంబప్రేక్షకుల్ని మెప్పించే అంశాలుంటాయి అన్నారు.

325

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles