చూసీ చూడంగానే..


Mon,August 5, 2019 12:50 AM

raj kandukuris son shiva kandukuris debut film titled choosi choodangaane

రాజ్ కందుకూరి తన తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. శేష సింధు రావు దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. వర్షా బొల్లమ్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి చూసీ చూడంగానే.. అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ సరికొత్త ప్రేమకథ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి చూసి చూడంగానే.. అనే టైటిల్‌ని ఖరారు చేశాం. క్రిష్ జాగర్లమూడి, సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన శేష సింధురావును ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం చేస్తున్నాం.

తమిళ హిట్ చిత్రం 96లో నటించిన వర్ష బొల్లమ్మను కథానాయికగా తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాం. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రంతో పాటు శివ కందుకూరి మరో మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: వేదరామన్, మాటలు: పద్మావతి విశ్వేశ్వర్, ఎడిటింగ్: రవితేజ గిరిజాల.

530

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles