అనుకున్న ఫలితం సాధించాం!


Mon,August 12, 2019 12:13 AM

Rakshasudu Movie Success Meet Bellamkonda Sai Srinivas Anupama Parameswaran

బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటించిన చిత్రం రాక్షసుడు. రమేష్‌వర్మ దర్శకుడు. కోనేరు సత్యనారాయణ నిర్మాత. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఇటీవలే ఈ చిత్రం విడుదలైంది. ఆదివారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ తమిళ మాతృక రాచ్చసన్ చూసి మేము ఎంతగానో థ్రిల్ అయ్యాం. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులందరూ అదే భావనను వ్యక్తం చేస్తున్నారు. గత రెండుమూడేళ్లుగా తెలుగులో ఇలాంటి ఉత్కంఠభరితంగా సాగిన కథ రాలేదని అంటున్నారు. సమీక్షకులందరూ ముక్తకంఠంతో సినిమా బాగుందని తీర్పునిచ్చారు. భారీ వర్షాల్లో కూడా సినిమా మంచి కలెక్షన్లను సాధిస్తున్నది. థియేటర్లు కూడా పెంచుతున్నారు. ఈ సినిమా విషయంలో మేము అనుకున్న ఫలితాన్ని సాధించాం. మా సంస్థ నిర్మించిన తొలి చిత్రంతోనే దర్శకుడు రమేష్‌వర్మ నిర్మాతగా నా పేరు నిలబెట్టాడు అన్నారు. పర్‌ఫెక్ట్ రీమేక్ చిత్రానికి నిదర్శనంగా ఈ సినిమా నిలిచిందని మారుతి చెప్పారు.

అభిషేక్ నామా మాట్లాడుతూ మొదటివారమే 32కోట్లు వసూలు చేసింది. రెండోవారంలో వసూళ్లు ఇంకా పెరిగాయి అని చెప్పారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ టీమ్ సమిష్టి కృషి ఫలితమిది. కమర్షియల్ విజయంతో పాటు విమర్శకులందరి ప్రశంసలు అందుకోవడం సంతోషంగా ఉంది అన్నారు. అమలాపాల్ మాట్లాడుతూ రాచ్చసన్ వంటి భారీ విజయాన్ని సాధించిన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసి సక్సెస్ అందుకోవడం మూమూలు విషయం కాదు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు అని చెప్పింది. దర్శకుడు రమేష్‌వర్మ మాట్లాడుతూ తమిళ మాతృక చూసిన వెంటనే..కథానాయకుడి పాత్రకు శ్రీనివాస్ మాత్రమే సరిపోతాడనిపించింది. ఆయన తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. నటీనటులందరూ అద్భుత అభినయంతో సినిమా విజయానికి కారణమయ్యారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

363

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles