రిస్క్ చేయాల్సిందే..!

Wed,November 13, 2019 12:43 AM

మన గురించి ఇతరులు ఏమనుకుంటారో అని పట్టించుకోవద్దు. చిత్రసీమలో రిస్క్‌లకు సిద్ధపడ్డప్పుడే ఆశించిన ఫలితాల్ని సాధిస్తాం అని చెబుతున్నది పంజాబీ ముద్దుగుమ్మ రకుల్‌ప్రీత్‌సింగ్. బాలీవుడ్ చిత్రం మర్జావన్‌లో ఈ అమ్మడు వేశ్య పాత్రలో కనిపించనుంది. తన కెరీర్‌లో తొలిసారి సవాలుతో కూడుకున్న పాత్రకు చేస్తున్నానని, నటిగా తనను మరో మెట్టెక్కించే చిత్రమవుతుందని ధీమా వ్యక్తం చేసింది రకుల్‌ప్రీత్‌సింగ్. ఆమె మాట్లాడుతూ దర్శకుడు మిలాప్ నా పాత్ర గురించి చెప్పినప్పుడు ఉద్వేగంగా అనిపించింది. కెరీర్‌లో అరుదుగా ఈ తరహా పాత్రల్ని పోషించే అవకాశం దక్కుతుంది. సీనియర్ నటి రేఖ ముఖద్దర్ కా సికందర్, టబు జీత్ చిత్రంలో పోషించిన పాత్రల స్థాయిలో దర్శకుడు నా క్యారెక్టర్‌ను తీర్చిదిద్దారు. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు నన్ను సరికొత్త అవతారంలో చూడబోతున్నారు. ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్ చేసే విషయంలో నేను ఏ మాత్రం సంశయించలేదు. ఓ నాయిక వేశ్య పాత్రను చేస్తుండటం అందరిలో ఆసక్తిని పెంచుతోంది అని చెప్పింది. ధైర్యం, కరుణ రెండు రసాలు సమపాళ్లలో కలబోసిన వేశ్యగా తన పాత్ర హృదయాల్ని కదిలించే విధంగా ఉంటుందని రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొంది. ఈ నెల 15న చిత్రం ప్రేక్షకులముందుకురానుంది.

739

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles