చిరు సినిమాలో చరణ్‌ ?

Mon,January 13, 2020 12:10 AM

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన ‘మగధీర’ ‘బ్రూస్‌లీ’ చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరిశారు చిరంజీవి. ‘ఖైదీనంబర్‌150’ చిత్రంలోని ఓ పాటలో రామ్‌చరణ్‌ నృత్యంతో కనువిందు చేశారు. ఇప్పుడు మరోమారు ఈ తండ్రీకొడుకులు వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. వివరాల్లోకి వెళితే..చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలైంది. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ నటించబోతున్నారని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. అయితే వాటిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ కీలకమైన అతిథి పాత్రలో కనిపించబోతున్నారని తెలిసింది. ఇందుకోసం ఆయన రెండు వారాల పాటు డేట్స్‌ కేటాయించారని చెబుతున్నారు. ఏప్రిల్‌ నెలలో ఈ సినిమా షూటింగ్‌లో రామ్‌చరణ్‌ జాయిన్‌ అవుతారని సమాచారం. ప్రస్తుతం రామ్‌చరణ్‌..ఎన్టీఆర్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

415

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles