గోవాలో ప్రణయగీతం


Tue,May 14, 2019 11:29 PM

Ram Pothineni starrer iSamrt Shankar Movie teaser will release on May 15

రామ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. డబుల్ దిమాక్ హైదరాబాదీ ఉపశీర్షిక. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ ఛార్మితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నభా నటేష్, నిధి అగర్వాల్ కథానాయికలు. టాకీపార్ట్ పూర్తయింది. ప్రస్తుతం గోవాలో పాటను చిత్రీకరిస్తున్నారు. పూరి జగన్నాథ్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇతివృత్తమిది. ఇద్దరు అందాల భామలతో ప్రేమలో పడిన హైదరాబాదీ ఇస్మార్ట్ శంకర్ ప్రణయానికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? అతడి డబుల్ దిమాక్ కథేమిటన్నది తెరపై ఆసక్తిని పంచుతుంది. రామ్ పాత్ర సరికొత్తగా ఉంటుంది. రామ్, నభానటేష్‌లపై గోవాలో ఓ పాటను చిత్రీకరిస్తున్నాం. రామ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం టీజర్‌ను విడుదల చేయనున్నాం అని తెలిపారు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, సుధాంశుపాండే, గెటప్‌శ్రీను ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: రాజ్‌తోట, ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ.

1517

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles