బాలీవుడ్ రీమేక్‌లో..

Fri,November 8, 2019 11:59 PM

కథాంశాల ఎంపికలో కొత్తదనానికి ప్రాముఖ్యతనిస్తుంటారు రానా. కథానాయకుడిగానే కాకుండా విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ వైవిధ్యమైన నటుడిగా నిరూపించుకున్నారు. తాజాగా ఆయన ఓ బాలీవుడ్ రీమేక్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. కార్తిక్‌ఆర్యన్, సన్నీసింగ్, నుష్రాత్‌బరుచా ప్రధాన పాత్రధారులుగా గత ఏడాది విడుదలైన బాలీవుడ్ చిత్రం సోను కె టీటు కి స్వీటీ వినోదభరిత కథాంశంతో చక్కటి వసూళ్లను సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రీమేక్‌లో రానా కథానాయకుడిగా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడితో పాటు మరో హీరోగా విశ్వక్‌సేన్ నటించనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్‌బాబు నిర్మించనున్నట్లుగా చెబుతున్నారు. త్వరలో ఈ రీమేక్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.

510

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles