గ్యాంగ్‌స్టర్ యుద్ధం


Thu,August 8, 2019 12:25 AM

ranarangam to release on independence day 15th august 2019

శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం రణరంగం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ కథానాయికలు. ఈ నెల 15న ఈ చిత్రం విడుదలకానుంది. నిర్మాత మాట్లాడుతూ ఓ గ్యాంగ్‌స్టర్ కథ ఇది. 1990తో పాటు ప్రస్తుత కాలంలో అతడి జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల సమాహారంగా సాగుతుంది. గ్యాంగ్‌స్టర్ ఎవరితో యుద్ధం చేశాడన్నది తెరపై ఆసక్తిని పంచుతుంది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా భావోద్వేగభరితమైన పాత్రలో శర్వానంద్ కనిపిస్తారు. వాస్తవిక అంశాల స్ఫూర్తితో దర్శకుడు సుధీర్‌వర్మ వినూత్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సెన్సార్ పూర్తయింది. యు.ఎ సర్టిఫికెట్ లభించింది. ఇటీవల విడుదలచేసిన ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ సినిమా అలరిస్తుంది అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ పిైళ్లె, ఛాయాగ్రహణం: దివాకర్ మణి.

481

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles