రవితేజ క్రాక్ మొదలైంది

Fri,November 15, 2019 12:10 AM

రవితేజ నటిస్తున్న తాజా చిత్రం క్రాక్ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గోపీచంద్ మలినేని దర్శకుడు. శృతిహాసన్ కథానాయిక. సరస్వతి ఫిలింస్ డివిజన్ పతాకంపై బి.మధు నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్‌నివ్వగా, పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విఛాన్ చేశారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ తెలుగు రాష్ర్టాల్లో జరిగిన యథార్థ సంఘటన ఆధారం చేసుకొని ఈ సినిమా కథ తయారుచేసుకున్నా. ఈ సినిమాలో రవితేజ శక్తివంతుడైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. కథానుగుణంగానే ఈ టైటిల్ పెట్టాం. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్, దేవిప్రసాద్, పూజిత పొన్నాడ, చిరాగ్‌జాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జి.కె.విష్ణు, సంగీతం: ఎస్.ఎస్.తమన్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.

464

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles