సందీప్‌రెడ్డికి మాతృవియోగం


Thu,August 22, 2019 11:43 PM

Sandeep Reddy Vanga Mother Passes Away

సినీ దర్శకుడు సందీప్‌రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లిగారైన సుజాత గురువారం వరంగల్ పట్టణం రామనాథపుర కాలనీలోని స్వగృహంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారామె. గురువారం ఉదయం సుజాత ఆరోగ్యపరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సందీప్‌రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అర్జున్‌రెడ్డి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన సందీప్‌రెడ్డి తొలి చిత్రంతోనే పరిశ్రమలో సంచలనం సృష్టించారు. అదే చిత్రాన్ని కబీర్‌సింగ్ పేరుతో హిందీలో రీమేక్ చేయగా..అక్కడా దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నారు.

471

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles