సందీప్‌రెడ్డి ‘డెవిల్‌'

Sun,September 15, 2019 11:22 PM

‘కబీర్‌సింగ్‌' (తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌) చిత్రంతో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ఈ చిత్రం 350కోట్ల కలెక్షన్స్‌ సాధించింది. ఈ అపూర్వ విజయంతో బాలీవుడ్‌ అగ్రహీరోలు సందీప్‌రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయడానికి ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం రణభీర్‌కపూర్‌ కథానాయకుడిగా సందీప్‌రెడ్డి ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారని తెలిసింది. ఈ సినిమాకు ‘డెవిల్‌' అనే టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారట. క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇతివృత్తంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో కథానాయకుడి పాత్ర చిత్రణ నెగెటివ్‌ షేడ్స్‌తో సాగుతుందని చెబుతున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుందని తెలిసింది.
Ranbir-Kapoor

803

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles