శంకర్‌ 2+1

Sun,October 6, 2019 12:05 AM

హాస్య నటుడు శంకర్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘2+1’. కాచిడి గోపాల్‌ రెడ్డి దర్శకత్వంలో ఎస్‌.కె.పిక్చర్‌, ఆకృతి క్రియేషన్స్‌ పతాకంపై సురేష్‌ కొండేటి, ఎడవెల్లి వెంకటరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను నిర్మాత సురేష్‌ పుట్టినరోజు సందర్భంగా నేడు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘రెండు విభిన్న పాత్రల్లో శంకర్‌ కనిపించబోతున్నాడు. మాస్‌ క్యారెక్టర్‌తో పాటు క్లాస్‌ టచ్‌ వున్న స్టూడెంట్‌ పాత్రలో శంకర్‌ నటన అందర్ని ఆకట్టుకునే విధంగా వుంటుంది’ అన్నారు. సురేష్‌ కొండేటి మాట్లాడుతూ ‘శంభో శంకర’ తర్వాత శంకర్‌తో నిర్మిస్తున్న మరో భారీ చిత్రమిది. భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో పాటు అందర్ని కడుపుబ్బ నవ్వించే వినోదం కూడా ఈ చిత్రంలో వుంటుంది. ఎనభై శాతం షూటింగ్‌ పూర్తయింది’ అని తెలిపారు. రుబికా, ఆక్సాఖాన్‌లు నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హరిగౌర, డైలాగ్స్‌: పటేల్‌ నందుర్క.

598

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles