ఓ తండ్రి ఎదురీత


Thu,March 14, 2019 10:52 PM

Sravan Raghavendra Edureetha Movie Teaser Launched By Kalyan Ram

ప్రతినాయక పాత్రల్లో నటించిన శ్రవణ్ రాఘవేంద్ర కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ఎదురీత. బాలమురుగన్ దర్శకుడు. బోగారి లక్ష్మీనారాయణ నిర్మాత. లియోనాలిషోయ్ కథానాయిక. ఈ చిత్ర టీజర్‌ను గురువారం హీరో కల్యాణ్‌రామ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రవణ్ రాఘవేంద్ర మాట్లాడుతూ తండ్రి, కొడుకు మధ్య సాగే ఎమోషనల్ డ్రామా ఇది. ఎంతగానో ప్రేమించే కొడుకును తండ్రి మరిచిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది భావోద్వేగభరితంగా సాగుతుంది. కథానుగుణంగా చక్కటి పాటలు కుదిరాయి అన్నారు. మంచి సందేశాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని నిర్మాత తెలిపారు. కథపై నమ్మకంతో సినిమా విషయంలో నిర్మాత ఎక్కడా రాజీపడలేదేని దర్శకుడు బాలమురుగన్ తెలిపారు. సంపత్‌రాజ్, జియాశర్మ, శాన్వీమేఘన, నోయెల్‌సేన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విజయ్ అర్పుదరాజ్, రచన: ధనేష్ నెడుమారన్, పాటలు: చల్లా భాగ్యలక్ష్మి, శ్రేష్ట, రోల్‌రిడా, విశ్వ, స్వామి, సంగీతం: అరల్ కొరెల్లి.

1927

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles