హాకీ ఎక్స్‌ప్రెస్

Tue,November 5, 2019 12:01 AM

సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఏ1 ఎక్స్‌ప్రెస్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్‌కిషన్, దయా పన్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకుడు. సోమవారం ఈ సినిమా ప్రారంభమైంది. నిర్మాతలు మాట్లాడుతూ హాకీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న తొలి తెలుగు చిత్రమిది. సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం. సందీప్‌కిషన్, మురళీశర్మ, రఘుబాబులపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నాం. హాకీ క్రీడాకారుడిగా సందీప్‌కిషన్ పాత్ర నవ్య పంథాలో సాగుతుంది. న్యూఏజ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సరికొత్త అనుభూతిని పంచుతుంది అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ తమిళ, ఛాయాగ్రహణం: కెవిన్‌రాజు, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల.

264

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles