పట్నఘడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట

Thu,November 7, 2019 11:12 PM

పగ, ప్రతీకారం నేపథ్యంలో దర్శకుడు రాజేష్‌టచ్‌రివర్ రూపొందించిన పట్నఘడ్ విడుదలపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సినిమా విడుదలను ఆపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. ఒరిస్సాలోని పట్నఘడ్‌లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథాంశంతో రాజేష్ టచ్‌రివర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. అతుల్ కులకర్ణి, యష్‌పాల్‌శర్మ, మనోజ్‌మిశ్రా, తనికెళ్లభరణి ప్రధాన పాత్రల్ని పోషించారు. పళ్లైన ఐదవ రోజున నవ దంపతులకు వచ్చిన ఓ గిఫ్ట్‌బాక్స్ ఓపెన్ చేయగానే అందులో ఉన్న బాంబ్ పేలి పెళ్లికొడుకుతో పాటు అతడి గ్రాండ్‌మదర్ చనిపోతుంది. హంతకుల కోసం సాగించిన అన్వేషణ నేపథ్యంలో తెలుగు, ఒరియా భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ బాంబ్‌బ్లాస్ట్ కేసులో నిందితుడిగా ఆరోపించబడుతున్న పుంజిలాల్‌మెహర్ భార్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు సినిమా పట్ల పిటిషనర్‌కు ఏమైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోపు సెన్సార్ బోర్డును సంప్రదించాలని సూచించింది. ఈ సినిమా కోసం ఒరియా భాషలో జానపద గీతాన్ని ఆర్పీ పట్నాయక్ స్వరపరిచారు.

262

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles