ఐరన్‌లెగ్‌ ముద్రవేశారు!


Wed,September 11, 2019 12:35 AM

Taapsee Pannu shares BTS picture from sets of Anubhav Sinha Thappad

సినిమా జయాపజయాల్ని కథానాయికలు పెద్దగా ప్రభావితం చేయలేరని, అయినా ఒక్కోసారి వైఫల్యాలకు నాయికలు కూడా బాధ్యత వహించాల్సి వస్తున్నదని వాపోయింది పంజాబీ సోయగం తాప్సీ. కెరీర్‌ తొలినాళ్లలో తాను అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నానని చెప్పిందీ భామ. చిత్రసీమలో తొమ్మిదేళ్ల ప్రయాణం పూర్తిచేసుకున్న సందర్భంగా అభిమానులతో కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని పంచుకుంది తాప్సీ. ‘కెరీర్‌ ఆరంభంలో కొన్ని సినిమాలు నావల్లే ఆడలేదని ఆరోపణలు చేశారు. ఐరన్‌లెగ్‌ అంటూ ముద్రవేశారు. ఏవో రెండు పాటలు ఇచ్చి, పేలవమైన సన్నివేశాల్లో నటింపజేసి.. సినిమా నా వల్లే ఫెయిల్యూర్‌ అయిందని చెప్పడం ఎంతగానో బాధించింది. నా కెరీర్‌ ఇక ముందుకుసాగదేమో అనుకున్నాను. అయితే ప్రతికూలతల్ని సానుకూలాంశాలుగా మార్చుకొని విజయాలు సాధించాను’ అని చెప్పింది ఈ అమ్మడు. తన సినీ ప్రయాణంలో విలువల విషయంలో ఎక్కడా రాజీపడలేదని, ఎటువంటి సినీ నేపథ్యం లేకున్నా ఆత్మవిశ్వాసంతో రాణించానచి చెప్పింది తాప్సీ. ఇటీవలే విడుదలైన ‘మిషన్‌ మంగళ్‌' చిత్రంలో ఆమె పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. ఇందులో తాప్సీ ఇస్రో శాస్త్రవేత్త కృత్తిక అగర్వాల్‌ పాత్రలో నటించింది. ప్రస్తుతం హిందీలో ‘సాండ్‌ కీ ఆంఖ్‌' ‘తడ్కా’ ‘తప్పడ్‌' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

540

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles