సరిలేరు నీకెవ్వరులో..


Mon,September 9, 2019 11:50 PM

Tamanna In Mahesh babu Sarileru Neekevaru Movie

పరాజయాలు ఎదురైనా తెలుగులో తమన్నా జోరు మాత్రం తగ్గడం లేదు. కథానాయికగా నటిస్తూనే అగ్ర హీరోలతో ప్రత్యేక గీతాల్లో ఆడిపాడుతోంది ఈ సొగసరి. తాజాగా ఆమె మహేష్‌బాబుతో ఓ పాటలో నటించబోతున్నట్లు సమాచారం. మహేష్‌బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్‌బాబు పరిచయం గీతాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నది. మాస్ శైలి బాణీలతో సాగే ఈ పాటలో మహేష్‌బాబుతో కలిసి తమన్నా నటించబోతున్నట్లు సమాచారం.

ఈ పరిచయ గీతం కోసం తమన్నా యాభై లక్షల పారితోషికాన్ని డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆగడు సినిమాలో మహేష్‌బాబు సరసన కథానాయికగా నటించింది తమన్నా. ఆ సినిమా తర్వాత వీరి కలయికలో రానున్న చిత్రమిదే కావడం గమనార్హం. దిల్‌రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్నది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

781

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles