లాయర్ రామకృష్ణ

Mon,November 4, 2019 12:13 AM

సందీప్‌కిషన్, హన్సిక జంటగా నటిస్తున్న చిత్రం తెనాలి రామకృష్ణ బీఏబీఎల్. కేసులు ఇవ్వండి ప్లీజ్ ఉపశీర్షిక. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి, రూపా జగదీష్, శ్రీనివాసులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. ఈ నెల 15న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సినిమాలోని రామకృష్ణ తెనాలి.. అనే టైటిల్ పాటను ఏపీలోని తెనాలిలో ఆదివారం చిత్రబృందం విడుదలచేశారు. నిర్మాతలు మాట్లాడుతూ పూర్తిస్థాయి వినోదభరిత కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. రామకృష్ణ అనే లాయర్ జీవితగమనంలో ఎదురయ్యే సంఘటనలు నవ్విస్తాయి. మహిళా లాయర్‌తో అతడు ఎలా ప్రేమలో పడ్డాడన్నది ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదల చేసిన పాటలు, టీజర్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. టైటిల్ గీతానికి ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందించారు అని తెలిపారు. వరలక్ష్మి శరత్‌కుమార్, మురళీశర్మ, బ్రహ్మానందం, వెన్నెలకిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తిక్, సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్.


547

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles