నవ్వించడం ఓ బహుమతి!

Fri,November 15, 2019 12:09 AM

సందీప్‌కిషన్, హన్సిక జంటగా నటిస్తున్న చిత్రం తెనాలి రామకృష్ణ. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. అగ్రహారం నాగిరెడ్డి, శ్రీనివాస్, సంజీవరెడ్డి నిర్మాతలు. నేడు ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ సందీప్‌కిషన్‌కు సినిమా తప్ప మరో లోకం తెలియదు. అంతటి పాషన్‌తో నటించాడు. హన్సిక చక్కటి భావోద్వేగలతో తన పాత్రకు న్యాయం చేసింది. టీమ్ అంతా శ్రమించి సినిమా అనుకున్న విధంగా రావడానికి కృషి చేశారు అన్నారు. థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఈ సినిమాను తీర్చిదిద్దారు. రెండుగంటల పాటు ప్రేక్షకుల్ని నవ్వించడం వారికిచ్చే బహుమతిగా భావిస్తున్నా. ప్రతి ఒక్కరికి నవ్వుల్ని పంచే చిత్రమిది అని సందీప్‌కిషన్ తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ ట్రైలర్‌కు ఇరవైనాలుగు గంటల్లో 30మిలియన్ వ్యూస్ లభించాయి. దాంతో సినిమాకున్న క్రేజ్ ఏమిటో అర్థమైంది. తమిళంలో సందీప్‌కిషన్‌కు మంచి మార్కెట్ ఉంది. అక్కడ రీమేక్ చేయబోతున్నాం అని చెప్పారు. ప్రేక్షకులందరికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని కథానాయిక హన్సిక చెప్పింది.

329

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles