తెలుగులో బిగిల్‌


Wed,September 11, 2019 11:37 PM

Thalapathy Vijay Bigil audio launch will take place in Chennai on THIS date

హీరో విజయ్‌, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తమిళంలో రూపొందిన ‘తెరి’,‘మెర్సల్‌' చిత్రాలు ఘన విజయాల్ని సాధించాయి. వీరి కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం ‘బిగిల్‌'. నయనతార కథానాయికగా నటిస్తున్నది. ఏజీయస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై కల్పాతి అఘోరామ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేష్‌ కోనేరు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. దీపావళి సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం విడుదలకానుంది. మహేష్‌ కోనేరు మాట్లాడుతూ ‘క్రీడా నేపథ్యంతో తెరకెక్కుతున్న కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. విజయ్‌ పాత్ర భిన్న పార్శాలతో శక్తివంతంగా ఉంటుంది. ఆయన కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదలచేస్తుండటం ఆనందంగా ఉంది. త్వరలో తెలుగు టైటిల్‌ను ప్రకటిస్తాం’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, సినిమాటోగ్రఫీ:జి.కె.విష్ణు.

471

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles