ట్రాప్‌లో పడేదెవరు?


Sat,August 10, 2019 11:58 PM

The whole trap with the trailer Rasamai Balakishan

మహేందర్, కాత్యాయనీ జంటగా నటించిన చిత్రం ట్రాప్. వీఎస్ ఫణీంద్ర దర్శకుడు. అల్ల స్వర్ణలత నిర్మాత. బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది. శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ ముఖ్యఅతిథిగా హాజరై చిత్ర ట్రైలర్, ఆడియో బిగ్‌సీడీని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ట్రైలర్ అందరిని ట్రాప్‌లో పడేసేలా ఉంది. స్వర్ణలత, మహేంద్రగారి మీదున్న అభిమానంతో ఈ వేడుకను వచ్చాను అన్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథ ఇది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయి.

అందరిని అలరించే చిత్రమవుతుంది అని దర్శకుడు తెలిపారు. నిర్మాత స్వర్ణలత మాట్లాడుతూ వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. థ్రిల్లర్ ఇతివృత్తంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. త్వరలో విడుదల చేయబోతున్నాం అని చెప్పింది. షాలు, రచ్చరవి, విఠల్, పరమేశ్వరశర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కె శివ, సంగీతం: ఈశ్వర్ పెరవలి, నేపథ్యసంగీతం: హర్ష ప్రవీణ్, నిర్మాణ సంస్థ: ప్రేమ కవితాలయ ఫిలిమ్స్, కథ, దర్శకత్వం: వీఎస్ ఫణీంద్ర.

383

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles