తల్లి ప్రేమ గొప్పతనంతో..

Tue,November 5, 2019 12:03 AM

వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులతో పాటు చిత్రసీమలో గౌరవాన్ని సంపాదించుకున్నాడు శ్రీవిష్ణు. భవిష్యత్తులో అతడు మరిన్ని మంచి సినిమాలు చేయాలి. ఈ చిత్ర పోస్టర్స్, ట్రైలర్స్ బాగున్నాయి అని అన్నారు దర్శకుడు వి.వి. వినాయక్. శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి జంటగా నటించిన చిత్రం తిప్పరా మీసం. విజయ్ కృష్ణ.ఎల్ దర్శకత్వం వహిస్తూ రిజ్వాన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 8న విడుదలకానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక జరిగింది. తొలి టికెట్‌ను వి.వి.వినాయక్, నారా రోహిత్ కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ అద్భుతమైన కథ, కథనాలతో రూపొందిన చిత్రమిది. పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమక్మం ఉంది. విజయ్‌తో వచ్చే ఏడాది నేను ఓ సినిమా చేయబోతున్నాను అని పేర్కొన్నారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ నెగెటివ్ షేడ్స్‌తో నన్ను దర్శకుడు వైవిధ్యంగా తెరపై ఆవిష్కరించారు. తల్లిగొప్పతనాన్ని చాటిచెప్పే సినిమా ఇది. ప్రపంచంలో అమ్మ ప్రేమ ఎప్పటికీ మారదనే అంశాన్ని హృద్యంగా ఈ సినిమాలో చూపించాం అని చెప్పారు. స్నేహితులందరూ కలిసి రూపొందించిన చిత్రమిదని, శ్రీవిష్ణు, రోహిణి మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయని కృష్ణవిజయ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.కుమార్‌చౌదరి, రోహిణి, అచ్యుతరామారావు, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.

220

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles