శత్రువు వ్యసనమే..


Fri,September 6, 2019 11:21 PM

Thippara Meesam Movie Offical Teaser Release

శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తిప్పరా మీసం’. కృష్ణ విజయ్‌.ఎల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, కృష్ణ విజయ్‌.ఎల్‌ ప్రొడక్షన్స్‌, శ్రీ ఓం సినిమా సంస్థలు నిర్మిస్తున్నాయి. నిక్కీ తంబోలి కథానాయిక. శుక్రవారం టీజర్‌ను చిత్రబృందం విడుదలచేసింది. కథాంశాలు, పాత్రల ఎంపికలో నవ్యతకు ప్రాధాన్యతనిచ్చే శ్రీవిష్ణు ఈ టీజర్‌లో పొడవైన గడ్డం, మెలితిరిగిన మీసాలతో విభిన్నంగా కనిపిస్తున్నారు. ‘మందు, సిగరెట్‌, అమ్మాయిల్లా..శత్రువు కూడా వ్యసనమే. ఆ వ్యసనానికి నేను బానిసనే’ అనే డైలాగ్‌తో యాక్షన్‌ సన్నివేశాల మేళవింపుగా టీజర్‌ సాగింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘ప్రతీకార నేపథ్యంలో సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా శ్రీవిష్ణు పాత్ర శక్తివంతంగా ఉంటుంది. అతడి పాత్రను తీర్చిదిద్దిన తీరు, లుక్‌ కొత్తగా ఉంటాయి. ఊహకందని మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. టీజర్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. కొత్తదనాన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరిని ఈ సినిమా మెప్పిస్తుంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సురేష్‌ బొబ్బిలి, ఛాయాగ్రహణం: సిద్‌.

334

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles