మోహన్‌లాల్‌ జోడీగా


Wed,September 11, 2019 12:34 AM

Trisha Krishnan  Mohanlal To Be Seen In Drishyam Maker Jeethu Joseph Next

‘హేజూడ్‌' సినిమాతో గత ఏడాది మలయాళంలో అరంగేట్రం చేసింది త్రిష. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంతో తొలి అడుగులోనే విజయాన్ని దక్కించుకున్నది. తాజాగా మలయాళంలో రెండో సినిమాను అంగీకరించిన ఈ సొగసరి మోహన్‌లాల్‌కు జోడీగా నటించబోతున్నది. ‘దృశ్యం’ తర్వాత మోహన్‌లాల్‌, దర్శకుడు జీతూజోసఫ్‌ల కలయికలో మరో సినిమా రాబోతున్నది. థ్రిల్లర్‌ కథాంశంతో విదేశీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటించనున్నది. ఇందులో మోహన్‌లాల్‌ పాత్రతో సమానంగా ఛాలెంజింగ్‌గా త్రిష పాత్ర ఉంటుందని చిత్రబృందం చెబుతున్నది. ఈజిప్ట్‌, కెనడాతో పాటు పలు దేశాల్లో ఈ సినిమాను తెరకెక్కించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నది.
Trisha-Krishnan

247

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles