వినాయక్‌ దర్శకత్వంలో..?


Fri,September 6, 2019 11:20 PM

V. V. Vinayak Next Movie With Ram Pothineni

వాణిజ్య కథాంశాల్ని తనదైన శైలి హంగులతో ప్రభావశీలంగా ఆవిష్కరిస్తుంటారు వి.వి.వినాయక్‌. శక్తివంతంగా కథానాయకుడి పాత్రచిత్రణ, భారీ పోరాటఘట్టాలతో ఆయన సినిమాలు మాస్‌ను బాగా మెప్పిస్తాయి. గత ఏడాది ‘ఇంటిలిజెంట్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే సరైన విజయాన్ని అందుకోలేపోయారు. ప్రస్తుతం వినాయక్‌ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతున్నది. నరసింహారావు దర్శకుడు. ఈ సినిమా కోసం శారీరకంగా సరికొత్త లుక్‌లో కనిపించడానికి సిద్ధమవుతున్నారు వినాయక్‌. మరోవైపు రామ్‌ కథానాయకుడిగా వినాయక్‌ దర్శకత్వంలో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవలే ‘ఇస్మార్ట్‌శంకర్‌' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు రామ్‌. ఇదే వరుసలో ఆయన మరో మాస్‌ ఇతివృత్తంతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. వినాయక్‌ చెప్పిన కథ నచ్చడంతో రామ్‌ సినిమాకు ఓకే చెప్పారని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. వి.వి.వినాయక్‌ శైలి మాస్‌ అంశాలతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలిసింది.

657

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles