ఆద్యంతం వినోదంతో..

Mon,September 30, 2019 12:05 AM

సుడిగాలి సుధీర్, గెటప్‌శ్రీను, ఆటో రాంప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 3మంకీస్. జి.అనిల్‌కుమార్ దర్శకుడు. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై నాగేశ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల సీనియర్ హీరో వెంకటేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజర్ ఆద్యంతం నవ్వించింది. 3మంకీస్ వినోదం ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకుల్ని అలరిస్తున్న సుడిగాలి సుధీర్ టీం ఈ సినిమా ద్వారా నవ్వుల్ని పంచబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం, దర్శకత్వం: జి.అనిల్‌కుమార్.

555

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles