భాగ్యన గరిలో పోరాటాలు


Thu,September 5, 2019 11:24 PM

Vijay Devarakonda to team up with Kranthi Madhav

విజయ్‌దేవరకొండ కథానాయకుడిగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.యస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, ఐశ్వర్యరాయ్, ఇజాబెల్లె కథానాయికలు. ఇటీవలే ఫ్రాన్స్‌లో కీలక షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలో ఫైట్‌మాస్టర్ కనల్‌కణ్ణన్ నిర్ధేశకత్వంలో పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు.

సినిమాలో ఈ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా ఉంటుంది. విజయ్‌దేవరకొండను కొత్త పంథాలో ఆవిష్కరించే ప్రేమకథా చిత్రమిది. వినూత్న ఇతివృత్తంతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. ఈ నెలాఖరుతో చిత్రీకరణ పూర్తవుతుంది. త్వరలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి టైటిల్‌కు ప్రకటిస్తాం అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జేకే, సంగీతం: గోపీసుందర్, ప్రొడక్షన్ డిజైన్: సాహిసురేష్, రచన-దర్శకత్వం: క్రాంతిమాధవ్.

480

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles