రెబల్స్ కలయికలో..


Mon,August 12, 2019 11:25 PM

Vijay Deverakonda Collaborates With Puri Jagannadh And Charmme Kaur For Next Film

తెరపై హీరోయిజం కంటే రియల్ లైఫ్‌లో లక్ష్యశుద్ధి కలిగిన ధిక్కార స్వభావిగా (రెబల్ విత్ ఏ కాజ్) యువతరంలో రౌడీ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ. ఇక దర్శకుడు పూరి జగన్నాథ్ పవర్‌ఫుల్ మాస్, యాక్షన్ కథాంశాలతో డాషింగ్ డైరెక్టర్ అనే పేరు తెచ్చుకున్నారు. ఏ విషయంలోనైనా నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని వ్యక్తం చేయడం పూరి నైజం. ఆటిట్యూడ్ విషయంలో ఎన్నో సారూప్యతులున్న వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమాకు రంగం సిద్ధమైంది. విజయ్‌దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాను పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించబోతున్నారు. ఇస్మార్ట్ శంకర్‌తో ఇటీవలే పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న పూరి జగన్నాథ్ తాజాగా విజయ్ దేవరకొండతో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సమర్పణ: లావణ్య, రచన-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

800

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles